ఎవరో దీక్షలు చేస్తే విధానంలో మార్పు ఉండదు: జగన్‌పై బొత్స వ్యాఖ్య!
Districts
oi-Srinivas G
By Srinivas
విశాఖ: ఎవరో దీక్షలు చేసినంత మాత్రాన ప్రభుత్వ విధానంలో మార్పు ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విశాఖపట్టణంలో విలేకరులతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. బోధనా రుసుముల చెల్లింపుల విషయంలో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారనేది ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమని మంత్రి బొత్స అన్నారు. విద్యార్థులకు సంబంధించిన బకాయిల చెల్లింపు విషయంలో జాప్యం జరుగుతుండడమనేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హయాం నుంచీ వస్తున్నదేనని స్పష్టం చేశారు.
చదువుకునే విద్యార్థులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదన్నారు. త్వరలో ఫీజులు చెల్లిస్తామన్నారు. శుక్రవారమే కొంత మొత్తం చెల్లిస్తున్నట్టు ప్రకటించామని చెప్పారు.
Minister Botsa Satyanarayana accused Ex MP YS Jaganmohan Reddy Fee Poru today at Vishakapatnam. He said government will not respond with some one's agitations.