హైదరాబాద్: జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ జిల్లాల్లో బంద్‌లో భాగంగా మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి హైదరాబాద్‌లో బైక్ ర్యాలీని నిర్వహించారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న హరీష్ రావు, నాయినిని పోలీసులు అరెస్టు చేశారు. బైక్ ర్యాలీ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభం అయింది. అయితే పద్మారావు నగర్ వద్దకు వచ్చిన తర్వాత పోలీసులు బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
తోపులాటలో ఎమ్మెల్యే హరీష్ రావు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డిలతో పాటు పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేశారు.
TRS MLAs Harish Rao and Nayani Narasimha Reddy organized today bike rally from Secunderabad. Police obstructed them at Padmarao Nagar denying permission. Police arrested Telanganites along with Harish, Nayani.