హైదరాబాద్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేయాలని మాదిగ రిజర్వేషన్ హక్కుల పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆయనే స్వయంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో బిల్లు పెట్టేందుకు ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. ఈ పార్లమెంటులో బిల్లు పెట్టకుంటే భారీ ఉద్యమం ఎమ్మార్పీఎస్ చేస్తుందన్నారు.
మార్చి 1వ తారీఖునుండి 2వ తారీఖు వరకు సుదీర్ఘ పోరాటం చేయడానికి ఎమ్మార్పీఎస్ కార్యాచరణ రూపొందించిందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టకుంటే భవిష్యత్తులో జరగబోటే పరిణామాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డియే బాధ్యత వహించాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలన్నారు.
MRPS president Manda Krishna Madiga demanded government to propose sc categorigation bill in this budget session. He urged CM Kiran Kumar Reddy take All Party to New Delhi.
Story first published: Thursday, February 24, 2011, 15:47 [IST]