మఖ నక్షత్రంలోకి కేతువు.. మార్చి 29 నుండి ఈ రాశులవారికి అన్నీ శుభాలే!
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక రాశులలో సంయోగాలు ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను సృష్టిస్తూ ఉంటాయి. రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలలో కూడా సంచారం చేస్తూ గ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి.
మఖా నక్షత్రంలోకి కేతువు
క్రూర గ్రహం గాను, పాపగ్రహం గాను చెప్పబడే కేతువు మార్చి 29వ తేదీన మఖా నక్షత్రంలోకి ప్రవేశించనుంది. మఖా నక్షత్రం లోకి కేతువు సంచారం రాబోయే ఎనిమిది నెలల పాటు కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను అందించనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహరాశి
కేతువు నక్షత్ర సంచారం సింహ రాశి జాతకులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది వీరికి వృత్తిలో పురోగతి కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు కేతువు సంచారం కారణంగా ఆర్థికంగా సానుకూల ఫలితాలు వస్తాయి. సృజనాత్మక రంగాలలో ఉన్న వారు ఈ సమయంలో లాభాలను చూస్తారు. ఇది వీరికి అద్భుతమైన సమయం.
వృషభ రాశి
కేతువు నక్షత్ర సంచారం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారి వృత్తి జీవితంలో మంచి మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగులకు వేతన పెరుగుదల కనిపిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మానసికంగా దృఢంగా, సంతోషంగా ఉండే ఈ సమయం వృషభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది.
కర్కాటక రాశి
కేతువు నక్షత్ర సంచారం కర్కాటక రాశి జాతకులకు లాభాలను కలుగజేస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి వ్యాపారాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. భారీ పెట్టుబడుల నుండి ఈ సమయంలో లాభాలు వస్తాయి. ఇది కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
తులారాశి
కేతువు నక్షత్ర సంచారం తులా రాశి వారికి కెరీర్లో సానుకూల మార్పులను తెస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వివిధ మార్గాల నుండి ధనార్జన సాధ్యమవుతుంది. ఇది తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications