సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !!
దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల భామ నటి "త్రిష". తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే థగ్ లైఫ్, ఐడెంటిటీ, విదాయమర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుప్పు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది. అలానే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్ లో నటించనుంది.
ఇటీవల తన సినిమాల ద్వారా కంటే కూడా వ్యక్తిగత వార్తలతో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఆమె రిలేషన్‌కి సంబంధించిన వార్తలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాగా ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కాగా విజయ్ - సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అని.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

కానీ అదే సమయంలో విజయ్, త్రిష ఓ వివాహ వేడుకకు కలిసి హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. విజయ్, త్రిష రిలేషన్‌పై ఎప్పటినుంచో గాసిప్స్ వినిపిస్తున్నా వీళ్లిద్దరు ఎప్పుడూ ఓపెన్ కాకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.
సినిమాలకు గుడ్ బై..
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న త్రిష.. కొత్త సినిమాలను మాత్రం ఒప్పుకోవడం లేదనే ప్రచారం నడుస్తుంది. దీంతో ఆమె సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. విజయ్ బాటలోనే త్రిష కూడా సినిమాలకు బై చెప్పేసి.. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అంతే కాకుండా గతంలో సైతం ఓ ఇంటర్వ్యూలో త్రిష సీఎం కావాలని ఉందంటూ వ్యాఖ్యానించిన వీడియోని ప్రస్తావిస్తున్నారు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం' త్రిష చేరవచ్చని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుపుతున్నారు. మరి ఆమె సినిమాలకు గుడ్‌బై చెబుతారనే వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?












Click it and Unblock the Notifications