ఉత్తరాంధ్ర కలిసిన తెలంగాణ: ఎమ్మెల్యేలకు మల్లుభట్టి కొత్త ప్రతిపాదన

కాగా శాసనసభను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అరగంటపాటు రెండోసారి వాయిదా వేసిన అనంతరం తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తాము తెలంగాణ అంశంపై సభలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించడానికి సిఎల్పీలో భేటీ అయ్యారు. ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి, అటు తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణపై తీర్మానం కోసం పట్టుబట్టడంతో కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఏమీ చేయలేక పోతున్నారు. అయితే కాంగ్రెసు ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించిన తీరుతో కాంగ్రెసు ఎమ్మెల్యేల తీరులో కొంత మార్పు కనిపిస్తుంది. గురువారమే ఎమ్మెల్యేలు తెలంగాణపై శాసనసభలో నిలదీస్తామని చెప్పారు. ఎంపీల తీరు మాకు మరింత బలాన్నిచ్చిందని చెప్పారు. అయితే సభలో ఎలా వ్యవహరించాలనే తీరుపై వారు సీఎల్పీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications