జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి సమైక్యవాద కుట్ర: పొన్నం ప్రభాకర్

సీమాంధ్ర నేతలు తెలంగాణను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు సమైక్యవాద నిర్ణయాన్ని వదిలేసి జై ఆంధ్ర నినాదాన్ని ముందుకు తేవాలని ఆయన కోరారు. తెలంగాణపై గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగాలని చూస్తోందని, ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అన్నారు. ఉద్యోగులు సొంత ప్రయోజనాల కోసం ఆందోళన చేయడం లేదని, తెలంగాణ కోసం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications