ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన 2011 - 12 బడ్జెట్ ముఖ్యాంశాలు

టోకు, చిల్లర ధరల మధ్య అధిక వ్యత్యాసాన్ని అంగీకరించేది లేదన్నారు. ఆహార ద్రవ్యోల్భణం తగ్గించేందుకు ఉత్పత్తి - సరఫరా మధ్య సమన్వయం సాధించాల్సి నెలకొల్పవలసి ఉందన్నారు. సబ్సిడీ కిరోసిన్ భారీగా పక్కదారి పడుతోందన్నారు. కిరోసిన్, వంటగ్యాస్ వేరుగా సబ్సిడీలో లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రస్తుత సంవత్సరం వృద్ధి రేటు 8.6 గా ఉందని, 2011-2012లో వృద్ధిశాతం లక్ష్యాన్ని 9గా పెట్టుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమీకృత వృద్ధినిధులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 2012 నుండి ప్రత్యక్ష పన్నుల విధానం ఉంటుందన్నారు. ఈ ఏడాది పార్లమెంటులో జిఎస్‌టి బిల్లు ఉంటుందన్నారు. ఆర్‌బిఐ చర్యలు ఆహార ద్రవ్యోల్భణ కట్టడికి తోడ్పడుతాయన్నారు. సేవా రంగాల వృద్ధిరేటు 9.1 సాధిస్తామన్నారు. ఎఫ్‌డిఐ విధానాలను మరింత సరళీకరణలు చేస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రుణ నిర్వహణ ఎజెన్సీ బిల్లు తీసుకు వస్తామన్నారు. కొత్త బ్యాంకుల అనుమతికి నూతన మార్గదర్శకాలు ఉంటాయన్నారు. 2014 నాటికి ద్రవ్యలోటును మూడు శాతానికి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నందన్ నీలేకని కమిటీ జూన్‌లోపు నేరుగా సబ్సిడీపై నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ సమావేశాల్లో బీమా, బ్యాంకింగ్, పించన్ బిల్లులు ప్రవేశ పెడతామన్నారు. అందరికీ ఆహార పథకం కింద సమతుల ఆహార లభ్యతకు ప్రోత్సహిస్తామన్నారు. సూక్ష్మ రుణ సంస్థలలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు ప్రోత్సహిస్తామన్నారు. సెబీలో నమోదైన మ్యూచువల్ ఫండ్స్‌లలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తామన్నారు.
సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు 3 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. రుణాల జారీలో అవకతవకల నివారణకు ఎలక్ట్రానికి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పండ్లు, కూరగాయల ధరల అదుపుకు 15 మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు, చేనేత రంగం ఉద్దీపనకు చర్యలు, వ్యవసాయ రంగం రుణాలు 3.75 లక్షల కోట్ల నుండి 4.75 లక్షల కోట్లకు పెంచారు. రైతులకు ఇచ్చే గరిష్ట రుణ పరిమితిని 4.50 లక్షలకు పెంచారు. భారత పారిశ్రామిక రంగం విదేశాలలో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలో భారత్ ఆటో రంగం మొబైల్‌లో రెండో స్థానంలో ఉందన్నారు. పారిశ్రామిక ప్రగతి, మౌలికా సదుపాయల కల్పనకు ప్రత్యేక చర్చలు ఉంటాయని, ప్రపంచవ్యాప్తంగా నల్లధనంపై జరుగుతున్న పోరాటంలో భారత్ కూడా పాల్గొంటుందన్నారు.
- స్వయం సహాయక సంఘాలకు రూ.500 కోట్లు
- చిన్న పరిశ్రమల రుణాల కోసం సిబ్బికి - రూ.5,000 కోట్లు
- చేనేత సహకార సంఘాలు రూ.3,000 కోట్లు
- గ్రామీణ గృహ నిర్మాణ నిధికి రూ.3,000 కోట్లకు పెంపు
- గృహ రుణాల పరిమితి రూ.25 లక్షలు
- మైక్రో ఫైనాన్స్ ఈక్వటీ ఫండ్ 100 కోట్లు
- నాబార్డు - 3,000 కోట్లు
- పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 40,000 కోట్లు
- పండ్లు, కూరగాయల ధరల అదుపు కోసం 7,800 కోట్లు
- పశుగ్రాసం కొరత నివారణకు రూ.300 కోట్లు
నూనె గింజ పంటల ప్రోత్సహానికి - 300 రూ.కోట్లు
- వ్యవసాయ రంగం అభివృద్ధికి 7,860 కోట్లు
- వ్యవసాయ రుణాలకు అదనంగా - 4.75 లక్షల కోట్లు
- ఆహార ధాన్యాల నిల్వలకు 1.50 లక్షల టన్నుల సామర్థ్యానికి పెంపు
- శీతల గిడ్డంగుల సామర్థ్యం మరో 5 లక్షల టన్నులకు పెంపు
- గృహ రుణాలు రాయితీ ఒక శాతానికి పెంపు, 10 లక్షల నుండి 15 లక్షలకు పెంపు
- మెట్రో నగరాలలో బస్సుల ఆధునీకరణకు మరిన్ని నిధులు
- ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యం పెంపు
- నల్లధనం నియంత్రణకు ఐదంచెల వ్యయం
- పరిశ్రమ ప్రగతికి మరో 7 మెగా క్లస్టర్ల ఏర్పాటు
- వ్యవసాయ రుణాల వడ్డీ రేటు యథాతధం
- సూక్ష్మ రుణ సంస్థలలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు
- ఈ ఏడాది ఆహార భద్రత బిల్లు
- అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు రూ.3000కు పెంపు
- మాదక ద్రవ్యాల నివారణకు జాతీయ విధానం
- బడ్జెట్‌లో మొత్తం వ్యయం 12,57,729 కోట్లు
- పన్నుల రాబడి అంచనా రూ.9,32,422 కోట్లు
- అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి రూ.244 కోట్లు
- విద్యారంగానికి రూ.52,057 కోట్లు
- విద్యాహక్కు చట్టం కింద రూ.21వేల కోట్లు
- గ్రామీణ బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్లు
- ఆరోగ్య రంగానికి రూ.26,760 కోట్లు
- హరిత భారత్ పథకానికి రూ.200 కోట్లు
- ప్రధాన సరస్సులు, నదుల ప్రక్షాళన, పరిరక్షణకు రూ.200 కోట్లు(గంగానది మినహా)
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.9,890 కోట్లు
- వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రతి జిల్లా అభివృద్ధికి రూ.30 కోట్లు
- వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి రూ.500 కోట్లు
- జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ రూ.8000 కోట్లు
- భారత్ నిర్మాణ్‌కు రూ.50,000 కోట్లు
- గనుల్లో పనిచేసే కార్మికులకు ఆరోగ్య భీమా
- ఎస్సీ, ఎస్టీ తెగ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు
- ఢిల్లీ, ముంబయి మెట్రో ట్రెయిన్ మూడో దశకు అనుమతి
- భారత స్టాంపుల చట్టానికి త్వరలో సవరణ
- 80 ఏళ్ల వృద్ధులకు పింఛన్ రూ.200 నుండి రూ.500కు పెంపు
- ఇప్పటి వరకు 20 లక్షల నెంబర్ల ఆధార్ కార్డులు జారీ
- ఆదాయ పన్ను మినహాయింపి పరిమితి 1.8 లక్షలకు పెంపు, కేటగిరిల్లో మార్పు