ఎమ్మెల్సీ ఎన్నికల పోరు, క్యాంపు రాజకీయాలు జోరు

అయితే అందరినీ ఒకే దగ్గర కాకుండా యాభైమందికి, వందమందికి ఒక శిబిరం చొప్పున ఏర్పాట్లు చేస్తూ బెంగళూరు, గోవా, కేరళ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక సంస్థలకు నామినేషన్ల తుదిగడువు ఈ నెల నాలుగు. కొన్ని చోట్ల ఇంకా నామినేషన్ వేయని అభ్యర్థులు కూడా ఓటర్లను ముందుగానే క్యాంపులకు తరలించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ వల్ల, తమ పదవీ కాలం త్వరలో ముగియనున్నందున అధికార పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రెసు అభ్యర్థులకే ఓటేస్తారనే నమ్మకం లేకుండా పోయింది.
దీంతో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నట్లు చెబుతున్నారు. క్యాంపు రాజకీయాల వల్ల అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగినట్లు కూడా చెబుతున్నారు. క్యాంపులు తదితర ఎన్నికల అవసరాలకు ఒక్కో అభ్యర్థికి రూ.ఆరు కోట్ల నుంచి రూ.పన్నెండు కోట్ల వరకు ఖర్చవుతుందని నేతలు అంచానా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాన పార్టీలు ఆర్థికంగా బలమైన వారినే ఎంపిక చేశాయి.












Click it and Unblock the Notifications