7న కాకరాపల్లికి వైయస్ జగన్, ప్రభుత్వ తీరుపై మండిపాటు

దీనిపై స్థానిక ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించింది. జీవనోపాధి కోల్పోతామన్న భయంతో ఆందోళన చేస్తున్న స్థానికులపై పోలీసులు ఏకపక్షంగా తుపాకులు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించడమే కాకుండా పూరిగుడిసెలను, గడ్డివాములను తగులబెట్టి వారికి నిలువనీడ లేకుండా చేయడంప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. సంఘటనకు బాధ్యులైన వారిని సస్పెండు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఆందోళన చెందుతున్న స్థానిక ప్రజలకు స్పష్టమైన భరోసా కల్పించడంతో పాటు అక్కడ సాధారణ పరిస్థితులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications