వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామా చేయాలంటే కావూరి పారిపోయాడు: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ కోసం తాము ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు మందా జగన్నాథం చెప్పారు. నిన్న, మొన్న తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం తమతో మాట్లాడుతుందని అనుకున్నామని, అయితే మాట్లాడకపోవడంతో ఈ రోజు పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్నామని ఆయన చెప్పారు. ఈ రోజు రాత్రి తమతో చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారని, దాంతో మధ్యాహ్నం తర్వాత పార్లమెంటు సమావేశాలను అడ్డుకోకూడదని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్దిష్టమైన చర్చలు ప్రారంభించే వరకు తాము పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఎవరి దారిలో వాళ్లం పోరాటం చేద్దామని పొన్నం ప్రభాకర్ అన్నారు.