వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుకు చిక్కులు: తెలంగాణ ఎంపీలతో ప్రణబ్ భేటీ, సీమాంధ్రుల విజ్ఞప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం చిక్కుల్లో పడింది. లోకసభను అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులకు తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు మద్దతు పలుకుతుండడం, సీమాంధ్ర, తెలంగాణ పార్లమెంటు సభ్యుల మధ్య వివాదం తలెత్తడం కాంగ్రెసు అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించాయి. జై తెలంగాణ నినాదాలతో లోకసభ గురువారం మూడో సారి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో స్పీకర్ మీరాకుమార్ లోకసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఈ స్థితిలో తెలంగాణ పార్లమెంటు సభ్యులతో ప్రణబ్ గురువారం రాత్రి 9గంటలకు సమావేశమవుతున్నారు.

తెలంగాణపై తాము ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నామో ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ పార్లమెంటు సభ్యులకు వివరించే అవకాశం ఉంది. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి తమకు సహకారం అందించాలని ఆయన సూచిస్తారని అంటున్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ వాదనలను వినిపించడానికి అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు వ్యాఖ్యలను కూడా వారు ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తెస్తారని అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, ఆ పరిస్థితిలో తాము పట్టుబట్టాల్సిన అనివార్యతలోకి ఎలా వెళ్లిందీ వారు ప్రణబ్‌కు వివరించే అవకాశం ఉంది.

కాగా, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రణబ్ ముఖర్జీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రత్యామ్నాయానికి తాము కట్టుబడి ఉంటామని పార్లమెంటు సభ్యులు ఆ ఇద్దరు నేతలకు చెప్పారు. దానిపై మరోసారి సమావేశమవుదామని ప్రణబ్ ముఖర్జీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో చెప్పారు. మొత్తం మీద, తెలంగాణ అంశంపై ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ స్థితిలోనే సివిసిగా థామస్ ఎంపిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెసుకు తలనొప్పిగా పరిణమించింది. ఈ రెండు అంశాలపై చర్చించేందుకు కాంగ్రెసు యుపిఎ భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

English summary
Pranab Mukherjee has decided to meet Congress Telangana MPs on Telangana issue. The meeting is going to be held at 9pm today. At the same time Seemandhra MPs met Pranab appealed to implement Srikrishna committee's sixth option.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X