సివిసిగా పిజె థామస్ నియమాకాన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు

థామస్ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, చట్టవిరుద్ధంగా జరిగిందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్ కపాడియా, న్యాయమూర్తులు కెఎస్ రాధాకృష్ణన్, స్వతంతర్ కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జిఎం లింగ్డోతో పాటు పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు థామస్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. కేరళ కోర్టులో థామస్‌పై క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న నేపథ్యంలో వారు ఈ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications