సంతకానికి మాజీ ఎంపీ జగన్ వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నిరాకరణ
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: శాసనసభ కోటాలో కింద కాంగ్రెసు పార్టీ శాసనమండలి అభ్యర్థిని సమర్థించేందుకు మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి గురువారం ఎమ్మెల్యే కోటా కింద ఎన్నుకోబడే కాంగ్రెసు అభ్యర్థిని సమర్థించే నామినేషన్ పత్రాలపై సంతకం చేసేందుకు నిరాకరించినట్టుగా తెలుస్తోంది.
జగన్ వర్గం తరఫున కూడా పలువురు శాసనమండలికి పోటీ చేసేందుకు రంగంలోకి దిగిన నేపథ్యంలో జగన్ వర్గం నేతలు కాంగ్రెసు అభ్యర్థులను సమర్థించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఏలూరు నుండి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మేక శేషుబాబు జగన్ వర్గం తరఫున శాసనసమండలి ఎన్నికలలో బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో వైయస్ జగన్ వర్గం పోటీకి దిగుతోంది.
Ex MP YS Jaganmohan Reddy camp Congress party MLA Gurnath Reddy was rejected to support Congress MLC candidate today. He rejected to sign to supporting nomination letter.
Story first published: Friday, March 4, 2011, 14:16 [IST]