వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హసన్ అలీ అరెస్టుకు అవకాశం, ఐటి శాఖ సమన్లు

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘనల ఆరోపణలకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అలీకి నోటీసు జారీ చేసింది. పూణేలోని కోరేగావ్‌లో గల హసన్ ఇంటిపై ఐటి శాఖ 2007 జనవరిలో దాడులు నిర్వహించింది. జ్యురిచ్‌లోని యుబిఎస్ ఖాతాలో 8.04 అమెరికా డాలర్లు ఉన్నాయనే ఆరోపణలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. హసన్ అలీ ఫిబ్రవరి 19వ తేదీన ఐటి శాఖ ముందు విచారణ నిమిత్తం హాజరయ్యాడు. ఫిబ్రవరి 19వ తేదీన ఐటి శాఖ ముందు హాజరు కావడానికి ముందు హసన్ అలీ రెండేళ్ల పాటు పరారీలో ఉన్నాడు.