వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీకి మనుగడ లేదు, సిఎం పదవికే ఆరాటం: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Kiran kumar Reddy
అనంతపురం: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టబోయే పార్టీ మనుగడ సాగించలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం అన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నేతలు టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా ఏ పార్టీ వచ్చినా మనుగడ సాగించలేదన్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని, ఆ సొమ్ముతో ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం చూస్తున్నాడన్నారు. జగన్ పార్టీ పెట్టకముందే అరిష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. కోట్లు దండుకున్న జగన్ సీఎం పదవి రాకపోవడంతోనే కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారన్నారు.

ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం టిడిపియే అన్నారు. కాంగ్రెస్‌తో రాజీపడనిది కేవలం టిడిపీయే అన్నారు. అవీనితి వల్లే దేశం అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. కేంద్రం నగదు బదిలీ పథకం ప్రవేశ పెడతానని చెప్పడం హర్షణీయమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. అవీనితిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఉన్నత విలువలు పాటించారని కొనియాడారు. టిడిపి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందన్నారు. ఆదాయం కూడా పెరిగిందని అన్నారు.

ప్రస్తుతం పాలన పూర్తిగా స్థంభించిపోయిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి ప్రజలకు మేలు కలిగించే దిశలో పని చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని సిఎంగా కాంగ్రెస్ పార్టీ వారే గుర్తించే స్థితిలో లేరన్నారు. బలహీన వర్గాలు, పేదలు ఉన్న జిల్లాలో టిడిపి కంచుకోట అని అన్నారు. అనంతపురం జిల్లాతో టిడిపికి విడదీయరాని అనుబంధముందని చెప్పారు.

English summary
Former CM and TDP President Chandrababunaidu said that Ex MP YS Jagan party will not survive. He blamed Jagan is devide with Congress due to CM post. He fired at central and stae governments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X