అసెంబ్లీలో బైఠాయించిన నాగం: తెలంగాణపై అసెంబ్లీ స్తంభన

డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ నాగం జనార్దన్ రెడ్డి వినలేదు. దీంతో సభను ఆయన పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆయన జై తెలంగాణ నినాదాలు చేశారు. సభ వాయిదా తర్వాత నాగం జనార్దన్ రెడ్డి స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. తెలంగాణ కోసం తాము కట్టుబడి ఉన్నామని, స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిందేనని ఆయన అన్నారు. చర్చల సందర్భంగా తెలంగాణపై అభిప్రాయాలు చెప్పాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. అయినా తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వినలేదు.












Click it and Unblock the Notifications