నాగం తో టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేల వివాదం, బాబు ప్రేక్షకుడే

నాగం జనార్దన్ రెడ్డితో మోత్కుపల్లి నర్సింహులు, కొత్తకోట దయాకర్ రెడ్డి వివాదానికి దిగారు. స్పీకర్ పోడియం వద్ద నుంచి వచ్చి సీట్లో కూర్చోవాలని వారు ఆయనకు సూచించారు. అయితే ఆయన వినలేదు. చంద్రబాబు ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ముసలం ప్రారంభమైనట్లేనని చెప్పాలి. సోమవారం సభ సమావేశం కాగానే నాగం జనార్దన్ రెడ్డి జై తెలంగాణ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఆయనను అనుసరించడానికి ప్రయత్నించారు. చంద్రబాబు తన కళ్లతోనే వారిని ఆదేశించారు. దాంతో వారు తమ తమ సీట్లలో కూర్చున్నారు. శాసనసభలో తెలుగుదేశం వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారింది. సండ్ర వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, కొత్త దయాకర్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డిని దూషించారు.












Click it and Unblock the Notifications