అనంతపురం: ఫ్యాక్షన్ జిల్లాలో హత్యాయత్నం జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిన్నాన్న అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపై బుధవారం హత్యాయత్నం జరిగింది. అయితే ఈ హత్యా యత్నం ఆయన ప్రత్యర్థులు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు చెందిన వ్యవసాయ భూమి కంచెకు విద్యుత్ షాక్ ఏర్పాటు చేయడం ద్వారా హత్య యత్నానికి పాల్పడ్డారు. యిల్లనూరు మండలం కొడగండ్లపల్లిలో ప్రత్యర్థులు ఆయనను హత్య చేయడానికి ఓ పంట తోట కరెంటు షాక్‌ను ఏర్పాటు చేశారు.
అయితే వారు విద్యుత్ షాక్ ఫెన్సింగ్‌కు పెట్టడాన్ని పెద్దారెడ్డి అనుచరులు ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయంపై స్థానిక పోలీసులకు పెద్దారెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Opposition make murder attempt on Ananthapuram district Dharmavaram MLA Kethireddy Venkataramireddy's uncle today. They put current shock to his fruit field fencing. But Peddareddy followers find it.
Story first published: Wednesday, March 9, 2011, 14:42 [IST]