సిఎంకు జగన్ చిక్కు: టిఆర్ఎస్‌ వైపు జగన్ వర్గం మొగ్గు?

Kiran Kumar Reddy
హైదరాబాద్: ఈ నెల 17న ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో 10 సీట్ల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి ఐదుగురు, ఎంఐఎం నుండి ఒక్కరు, ప్రజారాజ్యం పార్టీనుండి ఒక్కరు పోటీ చేస్తుండగా, టిడిపి ముగ్గురిని, సిపిఐ ఒక్కరిని నిలబెట్టగా, బలం లేని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఒకరిని నిలబెట్టింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జగన్ వర్గంపైన పడింది. చివరి అభ్యర్థి గెలుపు ఓటములు జగన్ వర్గం ఎమ్మెల్యేలపైనే ఆధారపడి ఉంది. కాంగ్రెసు, పీఆర్పీ, ఎంఐఎం మిత్రపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. అధికార పక్షానికి ఉన్న బలం నేపథ్యంలో కాంగ్రెసు, పీఆర్పీ, ఎంఐఎంలు మిత్ర పక్షంలోని ఏడుగురు అభ్యర్థులలో ఆరుగురు సునాయాసంగా గెలుస్తారు. ఇక మిగిలిన ఒక్కరిని గెలిపించుకోవడమే కష్టంగా మారింది.

అయితే జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే పెద్ద సమస్య ఏర్పడక పోవచ్చు. కాని ఇప్పటికే పీఆర్పీ, కాంగ్రెసు నుండి కొందరు అసమ్మతి నేతలు ఆత్మ ప్రభోదానుసారం అని చెప్పడం ద్వారా అధికార పక్షం ఇరుకున పడింది. దీంతో కాంగ్రెసు ఓట్లను ఎమ్మెల్సీలకు ఓట్లు పంచాలనే యోచనకి వచ్చింది. అయితే ఆ కేటాయింపుతో నిమిత్తం లేకుండా జగన్ వర్గం వ్యవహరిస్తే ప్రభుత్వానికి తలనొప్పే. కాంగ్రెసు విప్ జారీ చేస్తే ఎమ్మెల్యేలు కాంగ్రెసు అభ్యర్థులకు ఓటు వేయాల్సిందే. అయితే వారు కాంగ్రెసు అభ్యర్థికి ఓటు వేయడంలోనూ చాతుర్యం ప్రదర్శిస్తే అధికార పక్షానికి నష్టమే. జగన్ వర్గానికి అనుకూలంగా ఉంటున్నామని కాంగ్రెసు పార్టీని దెబ్బతీయడానికి వారి చేతిలో ప్రస్తుతం రెండు అస్త్రాలు ఉన్నాయి.

ఒకటి పార్టీ ఓట్లు పంచినప్పటికీ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా ఒకే అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా ఆ అభ్యర్థి కావాల్సిన వాటి కన్నా ఎక్కువ ఓట్లు పొందుతారు. దీంతో ఒకరికి అవసరానికి మించి ఓట్లు పడటం ద్వారా మరొ అభ్యర్థి నష్టపోతారు. కాగా విప్ పట్టించుకోకుండా తమ ఓటును తమ ఇష్టం ఉన్న అభ్యర్థికి ఓటు వేయడం రెండా దారి. టిఆర్ఎస్ తనకు 11 మంది ఎమ్మెల్యేల బలమే ఉన్నప్పటికీ అభ్యర్థిని నిలపడానికి కారణం ఇదే. జగన్ వర్గం ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకొని ఓటు వేయించుకోవచ్చనే భావన ఒకటి కాగా, తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని ఓట్లు పొందవచ్చుననేది రెండో కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+