ఇక నుంచి శృంగార వెబ్‌సైట్లకు .XXX డొమైన్ ఆమోదించిన ఐసిఎఎన్ఎన్
Technology
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
శాన్ ఫ్రాన్సిస్కో: శృంగార వెబ్‌సైట్ల ఆగడాలను నియంత్రించే దిశగా వాటికి ఓ ప్రత్యేక డొమైన్ పేరు రానుంది. అంతర్జాల వ్యవహారాలను పర్యవేక్షించే ఐసీఏఎన్‌ఎన్ శుక్రవారం .XXX డొమైన్ పేరుకు తుది ఆమోదం ఇచ్చింది. పెద్దవాళ్లకు సంబంధించిన విషయాలు ఉండే వెబ్‌సైట్లకు మాత్రమే ఈ పేరును వాడతారు. శృంగార వెబ్‌సైట్లు కొత్త డొమైన్ పేరుతో నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త డొమైన్ పేరుతో నమోదు చేయించుకునే వెబ్‌సైట్లు ప్రత్యేక దరఖాస్తు నింపాలి. దీనివల్ల శృంగార వెబ్‌సైట్లను సందర్శించే వారికి వైరస్, క్రెడిట్‌కార్డు మోసాలు, సమాచార చోరి తదితర అంశాల బెడద ఉండదనే నమ్మకం కలుగుతుందని ఐసీఏఎన్‌ఎన్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తడొమైన్ కోసం ఇప్పటికే 2,00,000 అభ్యర్థనలు రావడం జరిగిందన్నారు.
Porn Web sites may soon have their own virtual red light district in the form of a .xxx domain. After more than seven years of political wrangling, delays, and policy reversals, the Internet Corporation for Assigned Names and Numbers, or ICANN, gave what appears to be final approval to the controversial .xxx domain. The domains could start appearing within a few months.
Story first published: Monday, March 21, 2011, 12:22 [IST]