వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీత దాటిన నేతలపై చర్యలు ఉంటాయి: క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించిన నాయకులపై పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని కాంగ్రెసు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ సోమవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గులాం నబీ ఆజాద్‌కు వివరించానని చెప్పారు. ఆయన అన్నింటిని సావధానంగా విన్నారని చెప్పారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై తప్పకుండా సమయానుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ తీరును మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజమండ్రిలో తప్పుపట్టారు. ఆయన తీరు సరికాదని విమర్శించారు. రాష్ట్రం నుండి ఆయనను రెండు సార్లు రాజ్యసభకు పంపినా ఆయనకు రాష్ట్రంపై కృతజ్ఞత లేదన్నారు. ఆయన తీరు బాధాకరమన్నారు. ఆయన వెంటనే స్పందించి పోలవరానికి జాతీయ హోదా రావడానికి ప్రయత్నాలు చేయాలన్నారు.

English summary
Kantheti Satyanarayana said today that Congress party will take action on MLAs, who were opposing party rules. He was met today senior leader Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X