హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రి నాదెండ్ల భాస్కర రావులా మిగిలిపోతారా: మనోహర్‌కు రేవంత్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: సభ్యుల హక్కులను హరించిన మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిపై చర్యలు తీసుకుంటారో తండ్రి నాదెండ్ల భాస్కర రావులా మిగిలిపోతారో తేల్చుకోవాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ఉద్దేశించి అన్నారు. సభ్యులపై దాడికి దిగిన మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2014 వరకు ఉభయ సభల్లో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన నాదెండ్ల మనోహర్‌ను కోరారు. సభ్యుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత మనోహర్‌పై ఉందని ఆయన అన్నారు. వివేకానంద రెడ్డితో పాటు సభ్యులపై దాడికి ప్రయత్నించిన ఇతర శాసనసభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనలకు తెలంగాణ ప్రాంత సభ్యులను సస్పెండ్ చేసిన డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనకు బాధ్యులైనవారిని కూడా సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. ఒక వేళ వివేకానందరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే కొంత మంది ఒత్తిడికి లోనై, సీమాంధ్ర సభ్యుల పట్ల వివక్ష చూపుతున్న సభాపతిగా మనోహర్ మిగిలిపోతారని ఆయన అన్నారు. సభ సీమాంధ్ర సభగా, సీమాంధ్రుల అక్రమాలను కాపాడే సభగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.

గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల వీడియోలను మీడియాకు విడుదల చేసిన నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని ఆయన అన్నారు. మీడియాకు నాటి సంఘటనల వీడియోలను విడుదల చేసి తమపై చర్యలు తీసుకున్నారని, నేటి సంఘటనలపై కూడా అదే వైఖరిని తీసుకోవాలని ఆయన అన్నారు. దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోకపోతే నాదెండ్ల మనోహర్‌పై ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

English summary
TDP Telangana region MLA Revanth Reddy questioned Nadendla Manohar for assembly incident. He demanded suspension YS Vivekananda Reddy till 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X