వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయి వైయస్‌పై బురద చల్లుతున్నాయి: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయనగరం: కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయి అత్యంత గొప్పవాడైన వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలో ఆయన సోమవారం ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎస్. కోటలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తిరిగి రాలేడని తెలిసి, చెప్పుకోలేడని తెలిసి, వైయస్ లేరనే విషయాన్ని మరిచిపోయినట్లు నటిస్తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి బురద చల్లే కుట్ర చేస్తున్నాయని, అది చూస్తుంటే గుండె బరువెక్కుతోందని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ఓ మాట చెబుతూ ఉండేవారని, మనం బతికి ఉండగా ఎంత మంది జైజైలు కొట్టారనేది ముఖ్యం కాదనీ మరణించిన తర్వాత ఎంత మంది గుండెల్లో నిలిచిపోయామనేది ముఖ్యమని చెబుతూ ఉండేవారని, ఆ మాటలే శ్రీరామరక్షగా తాను ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం కూడదని చెప్పేవారమని, ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదనీ ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతూ ఉండేవారని ఆయన అన్నారు. విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు వైయస్సార్ అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

English summary
YSR Congress leader YS Jagan lashed out at TDP and Congress for making allegations against YS Rajasekhar Reddy. He said that Congress and TDP colluded to tarnish YSR image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X