కడప బరిలో మైసూరా రెడ్డి?: జగన్‌పై పోటీకి బలమైన అభ్యర్థి

ఇక కడప పార్లమెంటు స్థానం నుండి కూడా జగన్‌ను ఎదుర్కొనడానికి బలమైన అభ్యర్థిని పెట్టాలని చూస్తోంది. కాంగ్రెసునుండి టిడిపిలోకి వచ్చిన సీనియర్ నాయకుడు మైసూరారెడ్డిని కడపనుండి పోటీ చేయించాలనే యోచనలో ఉంది. అయితే కందుల రాజమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వంటి వారిని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ అభ్యర్థి దాదాపు ఖరారైనప్పటికీ, పార్లమెంటు అభ్యర్థిగా మాత్రం పై ముగ్గురిని పరిశీలిస్తోంది. పూర్తిగా పరిశీలించి పార్టీలో చర్చించిన అనంతరం ఏప్రిల్ 5వ తారీఖున అభ్యర్థులను ప్రకటించనున్నారు.
కడప, పులివెందుల ఉప ఎన్నికలపై చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ఆ జిల్లా టిడిపి నేతలతో ఉదయం చర్చించారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. కాగా ఈ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని జగన్ సంపాదించిన ఆస్తులనే ప్రచారాస్త్రాలుగా వినియోగించుకోవాలని టిడిపి భావిస్తోంది. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇంఛార్జ్‌గా నియమించాలనే యోచనలో కూడా పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా కాంగ్రెసు పార్టీ పులివెందులలో అభ్యర్థిని నిలబెట్టే యోచనలో లేనట్టుగా వార్తలు వస్తున్నాయని టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి అన్నారు. కాంగ్రెసు అభ్యర్థిని నిలబెట్టకుంటే జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టేనని ఆయన ఆరోపించారు. రెండు నియోజకవర్గాలలో టిడిపి గెలుస్తుందని, జగన్, కాంగ్రెసు పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే నిర్ణయం చంద్రబాబుకే అప్పగించామని అన్నారు.