హైదరాబాద్: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిన సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది. హైదరాబాదులోని సంతోష్ నగర్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ హుస్సేన్ అనే వ్యక్తిపై బుధవారం ఉదయం నడిరోడ్డుపై ఒక దుండగుడు దాడి చేశారు. ఇర్ఫాన్ ను తీవ్రంగా గాయపర్చి కొందరు పారిపోయాడు. అయనను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసిందని భావిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధం కారణంగా దాడి చేయించింది కూడా ఆయన బంధువే అని తెలుస్తోంది. దుబాయ్‌లో ఉంటున్న ఉస్మాన్ అనే వ్యక్తి రౌడీలను పురిగొల్పి చంపించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.