జేబులో పర్స్ లేకపోయినా షాపింగ్ కోసం సెల్ ఫోన్ ఉంటే చాలు

ఇది ఉంటే జేబులో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్టే. ట్రావెల్ విభాగంలో రైలు, విమానం, బస్ టిక్కెట్లను బుక్ చేయవచ్చు. ఎంటర్‌టైన్మెంట్‌లో సినిమా టిక్కెట్లు తీసుకోవచ్చు. షాపింగ్ విభాగంలో గ్యాడ్జెట్‌లు, మ్యూజిక్, పుస్తకాలు... ఇలా దేన్నయినా చిటికెలో కొనుగోలు చేయవచ్చు. సుమారు 100 కంపెనీల భాగస్వామ్యంతో వివిధ రకాల ఉత్పత్తుల్ని అందిస్తున్నారు. వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయాలి. MPINతో సర్వీసుని ఓపెన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని నమోదు చేయాలి. సైట్ నిర్వాహకులు బ్యాంక్ వివరాల్ని సమీక్షించి చెల్లింపులకు అనుమతి ఇస్తారు. ఇంటర్నెట్ ఎనేబుల్ మొబైల్‌లో ఉచితంగా ఎన్‌జీపే సర్వీసుని పొందొచ్చు. www.ngpay.com
యస్ బ్యాంకుతో కలిసి నోకియా కంపెనీ పూనె, ఛండీఘర్‌లో ఈ సౌకర్యాల్ని అందిస్తోంది. Easy Pay, Easy Send పద్ధతుల్లో చెల్లింపు వ్యవహారాల్ని చేయవచ్చు. 'ఈజీ పే'తో బిల్లు చెల్లిపులు చేస్తే, 'ఈజీ సెండ్' ద్వారా ఇతరుల మొబైల్ ఎకౌంట్‌లోకి డబ్బులు పంపొచ్చు. అంటే మొబైల్ మనీ సర్వీసుల్లో సభ్యులైన వినియోగదారులు ఒకరి Mobile Wallet నుంచి మరొకరి Mobile Walletలోకి డబ్బుని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఏదైనా ఎస్ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బుని డ్రా చేయవచ్చు కూడా. ఈ సర్వీసులో సభ్యులవ్వాలంటే ప్రత్యేక ఏజెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఏజెంట్ మొబైల్ ఎకౌంట్‌ను క్రియేట్ చేశాక దాంట్లో కొంత మొత్తం డిపాజిట్ చేయాలి. అయితే జీపీఆర్‌ఎస్ సదుపాయం తప్పనిసరి. www.mobilemoneyservices.co.in
కెన్యా, జపాన్ దేశాల్లో మొబైల్ వినియోగదారుల్ని ఆకట్టుకున్న 'ఎం-పైసే' సౌకర్యాల్ని ఎయిర్‌టెల్, వొడాఫోన్ నెట్‌వర్క్ కంపెనీలు దేశంలో అందుబాటులోకి తేనున్నాయి. అందుకు ఐసీఐసీఐతో ఒప్పందానికి సిద్ధం అవుతున్నాయి. దేశంలో సుమారు 650 మిలియన్ల మొబైల్ వినియోగదారులు ఉన్నప్పటికీ ఎన్‌జీపేలో ఒక మిలియన్, ఎంచెక్‌లో రెండు మిలియన్ల సభ్యులు మాత్రమే రిజిస్టరయ్యారు. మొత్తం వినియోగదారుల్లో బ్యాంకు వ్యవహారాల్ని మొబైల్‌లో చేస్తున్నవారి శాతం చాలా తక్కువే.
* ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నట్లయితే మొబైల్‌ని సెక్యూరిటీ పిన్ కోడ్‌తో లాక్ చేయండి.
* పాస్‌వర్డ్‌లను బ్రౌజర్‌లో సేవ్ చేయకండి.
* రిమోట్ వైపింగ్ ప్రోగ్రాంలతో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది.
* వ్యక్తిగత వివరాల్ని తెలుపమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి.
* బ్యాంకింగ్ అప్లికేషన్లను అధికారిక సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి.
* క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోండి.