హజారే దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం, అధికారిక ప్రకటనే తరువాయి

మేధావులు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, సినీరంగ ప్రముఖులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఒక్కతాటిమీదికి వచ్చి అవినీతి వ్యతిరేకపోరాటానికి మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అవినీతిని అరికట్టే విషయంలో తన ఎజెండాను ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజెప్పడంలో హజారే విజయం సాధించారు.
అన్నా హజారే ప్రతినిధులతో గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపగా శుక్రవారం రాత్రి ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. లోక్‌పాల్ బిల్లు రూపకల్పనకు హజారే ఆమోదించిన వ్యక్తులతో సంయుక్త కమిటీ వేయడానికి ప్రభుత్వం ఒప్పుకొంది. కమిటీ ఆధ్వర్యంలో జూన్ 30 లోగా ముసాయిదా బిల్లు రూపకల్పన పూర్తిచేసి, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ ప్రకటించారు.
అన్నా హజారే ఈరోజు దీక్ష విరమించడానికి అంగీకరించడం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనందం వ్యక్తంచేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడతామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications