హరికృష్ణకు చంద్రబాబు షాక్: కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉమ కొనసాగింపు

తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దేవినేని ఉమ నాయకత్వంలో తాను పని చేయలేనని, పార్టీ పదవికి రాజీనామా చేస్తానని వంశీ ప్రకటించారు. దాంతో తన పార్టీ పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు రాజీనామా చేశారు. దేవినేని ఉమ రాజీనామా చేశారు కాబట్టి తాను పార్టీ పదవిలో కొనసాగుతానని వంశీ ప్రకటించారు. అయితే, పరిస్థితి వంశీకి ఎదురు తిరిగింది.












Click it and Unblock the Notifications