నిలకడగా సత్యసాయి బాబా ఆరోగ్యం: వైద్యానికి స్పందిస్తున్న బాబా
State
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ సఫయా మంగళవారం తాజా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం మరింత మెరుగు పడిందని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. తాము చేస్తున్న వైద్యానికి సత్యసాయి బాబా స్పందిస్తున్నారని చెప్పారు. చికిత్స కొనసాగుతుందని చెప్పారు. చికిత్సకు పాజిటివ్‌గానే స్పందిస్తున్నారని చెప్పారు. బాబా రక్తపోటు, గుండెచప్పుడు సాధారణంగా ఉన్నాయన్నారు. అయితే డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు.
బాబా ఆరోగ్యంపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. బాబా త్వరలోనే అందరి ముందుకు వస్తారని చెప్పారు. కాగా పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న బాబా ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతుండటం భక్తులను కుదుట పరుస్తుంది.