యాగాలతో తెలంగాణ వస్తే తెరాస ఎందుకు: కెసిఆర్‌ను ప్రశ్నించిన నారాయణ

K Narayana
హైదరాబాద్‌: చండీయాగంతో తెలంగాణ వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు.యాగాలతో తెలంగాణ వచ్చేట్టయితే ఇక తెరాస ఎందుకని సీపీఐ నేత నారాయణ ఆయన అడిగారు. యాగాలతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కాంగ్రెసు భూస్థాపితమైతేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. చంద్రశేఖర రావు అగ్నిగుండం నుంచి యాగాల వరకు వచ్చారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని కెసిఆర్ విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు.

జీవో 177ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యోగ సంఘాలతో కలసి ఆందోళన చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీబీనగర్‌ నిమ్స్‌ ఆసుపత్రి ప్రయివేటీకరణ యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నిక ప్రచారానికి 17మంది మంత్రులు వెళ్లడాన్ని ఆయన ఆక్షేపించారు. నో వర్క్ నో పే అంటూ ఉద్యోగుల ఆందోళనలను నిషేధిస్తూ ప్రభుత్వం 177 జీవోను జారీ చేసింది. రాజకీయ సమ్మెలున్నంత కాలం పౌర హక్కుల సమ్మెలుంటాయని నారాయణ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+