కారు-లారీ ఢీ: నలుగురు మృతి, హైదరాబాదులో హత్యా యత్నం
Districts
oi-Srinivas G
By Srinivas
మెదక్/హైదరాబాద్: లారీ - కారు గుద్దుకోవడం పల్ల నలుగురు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ మండలం హుగ్గెళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. లారీ, కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.
కాగా హైదరాబాదులో ఓ వ్యక్తిని నరికారు. పలువురు దుండగులు హైదరాబాదులోని ఉప్పుగూడలో చరణ్ అనే వ్యక్తిని కత్తులతో నరికారు. ఆయనకు తీవ్ర కత్తి పోట్లు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.