ఉప ఎన్నికల తర్వాత సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మార్పు: గోనె

ఉప ఎన్నికలలో ప్రచారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు అందరినీ పంపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళా మంత్రులు అందరినీ పులివెందుల వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి వ్యాపార కుటుంబం అని ఆయన తెలిపారు. రాజకీయాలలోకి రాకముందే ఆయన ఆదాయపు పన్ను చెల్లించారని చెప్పారు.
జగన్మోహన రెడ్డి కూడా తన తండ్రి ముఖ్యమంత్రి కాకముందు నుంచే దేశంలోని పలు రాష్ట్రాలలో చట్టబద్దమైన వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి జగన్‌కు రెండు లక్షల ఆధిక్యం రాదని చెప్పడం ద్వారా జగన్ గెలుపును ఖాయం చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications