ప్రతి పైసాకు లెక్కలున్నాయి: ఆస్తులపై సత్య సాయి ట్రస్టు వివరణ

ట్రస్టు ద్వారా విరాళాలను నగదు రూపేణా తీసుకునే అవకాశమే లేదని, ట్రస్టుకు అందే చెక్కులు, డ్రాఫ్టులను ట్రస్టు ఆర్థిక అధికారి ప్రతి రోజూ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని ,విదేశాల నుంచి వచ్చే విరాళాలను జమ చేయటానికి ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, 1976 విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద కేంద్ర హోంశాఖ ఆమోదంతో ఖాతాలు నిర్వహిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన అన్ని పనులకు ట్రస్టు వ్యవస్థాపకులు సత్యసాయిబాబా అనుమతి తప్పనిసరి అని, నేరుగా ఎవరికీ నగదు చెల్లింపులు చేసే ప్రసక్తి లేదని చెప్పారు.
ట్రస్టు సభ్యుల నియామకాలన్నీ సత్యసాయి బాబా స్వీయ నిర్ణయం మేరకే జరిగాయని, ట్రస్టులో ఉన్న సభ్యులెవరూ ఎలాంటి గౌరవ వేతనం, ఇతర ప్రయోజనాలు పొందటం లేదని, బాబా చేపట్టిన పనులకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించేలా చూడటమే సభ్యుల కర్తవ్యమని స్పష్టం చేశారు. ట్రస్టుకు అందే విరాళాలు.. ఖర్చులకు సంబంధించి లెక్కలను పక్కాగా నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించిన లెక్కలను ఆడిట్ నిర్వహించి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నామని, ప్రతి ఖర్చుకు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని, దీనివల్ల నిధులను మళ్లించటం, లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసే ప్రశ్నకు తావే లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications