వైయస్ ఫోటోతో రాజ్యాధికారమే జగన్ లక్ష్యం: టిజి వెంకటేష్

TG Venkatesh
కడప/హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటోతో రాజ్యాధికారం ఆశిస్తున్నారని చిన్న నీటి పారుదల శాఖామాత్యులు టిజి వెంకటేష్ మంగళవారం కడప జిల్లాలో అన్నారు. వైయస్ కలలు కాంగ్రెసు పార్టీయే నెరవేరుస్తుందని అన్నారు. కాంగ్రెసు వైయస్ బాటలో నడుస్తుందని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. సోనియా విదేశీ హక్కు ప్రశ్నించడానికి మనం విదేశాల్లో పుట్టిన మతాన్నో, దేవుడినో స్వీకరించడం లేదన్నారు.

కాగా కడప, పులివెందుల ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాదులో ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రుల గురించి టిడిపి కడప పార్లమెంటు అభ్యర్థి మైసూరారెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకనిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కలిసి కోరినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+