హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరిగొస్తాం, వేటు వేయకండి: కాంగ్రెసుకు జగన్ వర్గం ఎమ్మెల్యేల వినతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులలో పలువురికి అనర్హత వేటు భయం పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని తమపై వేటు వేయవద్దని పార్టీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై అధికార కాంగ్రెసు పార్టీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. వేటు పేరుతో జగన్ వర్గం ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలకు మరింత పదును పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే కమలమ్మను దారిలోకి తెచ్చుకున్నారు. తదుపరి లక్ష్యంగా శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేలతో చీప్ విఫ్ మల్లుభట్టి విక్రమార్క బుధవారం సమావేశం అయినట్లుగా సమాచారం.

శ్రీనివాసులు కాంగ్రెసులో ఉండాలా, జగన్‌తో ఉండాలా అనే విషయంపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. దీంతో అలాంటి వారిని సాధ్యమైనంత తొందరగా తమ వైపుకు తిప్పుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే హుటాహుటినా శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులును హైదరాబాదుకు రప్పించి వారితో మల్లుభట్టి సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. సాయంత్రంలోగా కాంగ్రెసులోనికి తిరిగి వస్తున్నట్లుగా ప్రకటించాలని వారిని పార్టీ అదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం పార్టీ ఉప సభాపతి నాదెండ్ల మనోహర్‌కు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదు చేయకూడదంటే వారు తాము కాంగ్రెసులోనే ఉంటున్నట్లు ప్రకటించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసమే మల్లుభట్టి వారితో భేటీ అయినట్లుగా సమాచారం. అయితే వారు సమయం తీసుకుంటామని చెప్పినప్పటికీ అందుకు పార్టీ నేతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీలో ఉంటారా, జగన్‌తో వెళతారా అనే విషయంపై ఈరోజు బహిరంగంగా ప్రకటిస్తేనే ఫిర్యాదుపై వెనక్కి తగ్గుతామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తమపై ఫిర్యాదును తప్పించుకోవడానికి కమలమ్మ బాటలోనే శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి పయనించనున్నారని, ఈ విషయంపై సాయంత్రంలోగా ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp MLAs Srikanth Reddy and Srinivasulu met with government chief whip Mallu Bhatti Vikramarka today. It seems, they may join in congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X