క్షీణిస్తున్న సత్య సాయిబాబా ఆరోగ్యం, ఊపందకున్న వారసత్వ పోరు

సత్య సాయి బాబానే ఇప్పటి వరకు ట్రస్టు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 39 ఏళ్ల రత్నాకర్ పుట్టపర్తిలో కేబుల్ టీవీ ట్రాన్స్‌మిషన్‌ను నియంత్రిస్తున్నారు. పుట్టపర్తిలోని హిందూస్తాన్ పెట్రోల్ పంపు డీలర్ కూడా. 33 ఏళ్ల సత్యజిత్ తన ఐదో ఏటనే సత్య సాయి పాఠశాలలో చేరారు. సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో ఎంబిఎలో ప్రథమ స్థానం సంపాదించాడు. బాబాకు జీవితాంతం సేవ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. బాబా వ్యక్తిగత కేర్ గివర్ స్థాయికి ఎదిగాడు.
సత్య సాయిబాబా బరువు 32 కిలోలకు తగ్గినట్లు సమాచారం. ఈ స్థితిలో బాబా తర్వాత సంస్థను ఎవరు నడపాలనే విషయంపై ఆయన బంధువులు ట్రస్టు సభ్యులతో చర్చలు జరపడంలో మునిగిపోయినట్లు చెబుతున్నారు. సత్య సాయిబాబా తర్వాత రత్నాకర్, సత్యజిత్‌లకే ఎక్కువ హక్కులుంటాయని వారు కూడా చెబుతున్నారు. ఏ పార్టీలోనూ సభ్యుడు కాకపోయినా రత్నాకర్‌కు రాజకీయ సంబంధాలున్నాయి. ఆయన తండ్రి జానకీరామ్ 1989 నుంచి 2000 వరకు అనంతపురం జిల్లా కాంగ్రెసు కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బాబా కుటుంబ సభ్యుల్లో రత్నాకర్ ఒక్కరే ట్రస్టు సభ్యుల్లో ఉన్నారు.
సత్యజిత్ 2002 నుంచి బాబా వ్యక్తిగత సహాకుడిగా ఉన్నారు. బయటివాళ్లు బాబాను చూడాలంటే ఆయన అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆయన అనుమతితోనే ఎవరైనా ప్రశాంతి నిలయంలోని యజర్ మందిర్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ట్రస్టులో తమిళుల అధిపత్యం పట్ల బాబా కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications