నైజీరియన్ లాటరీ చీటింగ్ కేసులో ముగ్గురు యువతుల అరెస్టు
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: నైజీరియన్ లాటరీ చీటింగ్ కేసులు ముగ్గురు ఉత్తర భారత యువతులతో సహా పన్నెండు మందిని సిఐడిపోలీసులు న్యూఢిల్లీలో అరెస్టు చేశారు. నైజీరియన్ లాటరీ పేరుతో భారీ మోసాలకు పాల్పడిన చీటింగ్ చేసిన వారిని సిఐడి పోలీసులు అరెస్టు చేసారు. వారు మోసాలకు పాల్పడింది మన రాష్ట్రంలోనే అని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ చీటింగ్ కేసులు ఢిల్లీ పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు.
అందులో 9 మంది నైజీరియన్లు కాగా ముగ్గురు ఉత్తర భారత్‌కు చెందిన యువతులు కావడం విశేషం. వారి వద్ద నుండి ఎనిమిదిలాప్‌టాప్‌లు, 12 సెల్‌ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.