హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చిరంజీవిపై ఒత్తిడి ఉంది: వంగా గీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vanga Geetha
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవిపై పార్టీ నేతలు, కార్యకర్తల నుండి తీవ్ర ఒత్తిడి ఉంది సోమవారం చెప్పారు. వంగా గీత డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి పార్యీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పార్టీలో ఏకాభిప్రాయంతోనే వీలినం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అందరి అభిప్రాయాలు పార్టీ సేకరించిందన్నారు. విలీనం అంశంపై ఎన్నో సమావేశాలు కూడా నిర్ణయించామన్నారు. అప్పుడు వారిని పిలిచామని వారే హాజరు కాలేదని చెప్పారు.

అప్పుడు సమావేశాలకు హాజరు కాకుండా ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఇన్నాళ్లుగా చెప్పకుండా ఇప్పుడు తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగానే విలీనం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జగన్‌తో వెళుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పార్టీలో మెజార్టీ సభ్యులు కోరుతున్నారని ఆమె చెప్పారు. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

English summary
PRP leader Vanga Geetha said that party president Chiranjeevi have pressure from party leaders to take action on MLAs who are going with YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X