వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు: చంద్రబాబు

Chandrababu Naidu
కడప: వైయస్ జగన్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని, జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో లక్ష కోట్ల రూపాయలు సంపాదించి తన తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారని ఆయన గురువారం తన ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ధ్వజమెత్తారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు గెలుపొందడానికి డబ్బులు పంచుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా లేదా కానీ జగన్‌కు మాత్రం ఊరూరా కోట్లాది రూపాయల విలువ చేసే ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. బిజెపితో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారని అన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో సంబంధాలు పెట్టుకొని బిజెపితో లాలూచి పడుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెసు పార్టీ పనికి రాని పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. అసమర్థ కాంగ్రెసు పార్టీ, అవినీతి జగన్‌కు ఓటు వేయవద్దని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు నీతికి - అవినీతికి మధ్యనే పోరు అని చెప్పారు. కడప పార్లమెంటు నుండి మైసూరారెడ్డిని, పులివెందుల నుండి బిటెక్ రవిని ఓటర్లు తప్పకుండా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+