• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Q4 ఫలితాలను ప్రకటించిన విప్రో, నికర లాభం 1,375 కోట్లు

By Srinivas
|

Azim Premji
దేశంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 3వ స్థానంలో ఉన్న విప్రో బుధవారం నాడు ఆర్థిక ఫలితాలు ప్రక టించింది. మార్చి 31తో ముగిసిన నాలుగవ త్రైమాసానికి ఏకీకృత నికర లాభంలో 13.77 శాతం వృద్ధితో రూ. 1,375.4 కోట్లు నమోదు చేసింది.గత ఏడాది కంపెనీ ఇదే కాలానికి రూ.1,208.9 కోట్లు ఆదాయాన్ని గడించింది.కంపెనీని మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లామని...కస్టమర్‌ ఫ్రెండ్లిగా తీర్చిదిద్దామని... కొత్త కొత్త వ్యాపార వ్యూహాలతో మ రింత పురోభివృద్ధిని సాధిస్తామని విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ రెవెన్యూలో ఐటీ సేవలే 76 శాతం ఆక్రమించా యి.. 1,400 మిలియన్‌లకు చేరాయి. 4.2 శాతం వృద్ధి న మోదు చేసింది. సంవవత్సరం ప్రాతిపదికన చూస్తే 20.1 శా తం వృద్ధిని సాధించింది.ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రై మాసికంలో జూన్‌ 30, 2011 నాటికి ఐటీ సర్వీసు వ్యాపా రం ద్వారా 1,394 మిలియన్‌ల నుంచి 1,422 మిలియన్‌ల వ్యాపారం సాధించవచ్చునని తెలిపింది.

ఉద్యోగాల విషయానికి వస్తే నాలుగవ త్రైమాసికంలో 2,894 మందిని తీసుకున్నట్లు... మొత్తం సంవత్సరానికి 14,314 మందిని ఉద్యోగాల్లోకి తసుకున్నట్లు చెప్పారు. అ యితే మార్చి 31, 2011 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగు ల సంఖ్య 1,22,385 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని.. 4క్యూలో 68 మంది కస్టమర్లు చేరారని దీంతో ఈ ఏడాది మొత్తం కొత్త కస్టమర్ల సంఖ్య 155కు చేరింది.పరిస్థితులు వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని.. కంపెనీ అభి వృద్ధికి మరింత పెట్టుబడులు పెడతామని ఈ ఏడాది జూన్‌ 1, 2011 నుంచి ఉద్యోగుల వేతనాలు కూడా పెంచుతామని.. దీ ని వల్ల లాభాల మార్జిన్‌పెై ప్రభావం పడుతుందని సురేశ్‌ సేనా పతి అన్నారు.

నాలుగవ త్రైమాసికంలో నికర అమ్మకాలు రూ.8,302.4 కోట్లు కాగా, అంతకు ముందు ఏడాది 2009-10లో రూ. 7,016.1 కోట్లు 18.33 శాతం వృద్ధి చెందింది. మార్చి 31, 2011 నాటికి కంపెనీ నికర లాభం రూ.5,297.7 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది రూ.4,593.1 కోట్లు 15.34 శాతం వృద్ధిని సాధించింది.2010-11 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల ద్వారా నికర లాభంలో 14.51 శాతం వృద్ధితో 31,098.7 కోట్లు కాగా, అంతకు ముందు ఏడాది 27,157.4 కోట్లు. 2011 4క్యూ విషయానికి వస్తే ఏకీకృత నికర లాభం రూ.1,337.6 కోట్లు గత ఏడాదితో పోల్చుకుంటే 8.15 శాతం వృద్ధిని సాధించిది. మార్చి 31, 2011తో నాటికి కంపెనీ చేతిలో నగదు, నగదు తో సమానమైన బాండ్లు రూ.6,114.1 కోట్లు ఉన్నాయని.. బోర్డు ఆఫ్‌ డెైరెక్టర్లు రూ.2 ముఖ విలువ కలిగిన షేరుపెై రూ.4 డివిడెండ్‌గా ప్రకటించింది.

విప్రో చైర్మన్ అజీమ్‌ ప్రేమ్‌జీ బుధవారం నాడు పత్రికల వారితో మాట్లాడుతూ... ఇన్ఫోసిస్‌ జరిగే పరిణా మాలు గురించి తనకు నిజంగానే తెలియని.. మీడియాలో వ చ్చే కథనాలు తప్ప ప్రత్యేకంగా తనకు ఇన్ఫోసిస్‌లో జరిగే విష యాలు తెలియవన్నారు. దీనిపెై తాను వ్యాఖ్యానించేది కూడా ఏమీలేదని ఇన్ఫోసిస్‌లో జరిగే పరిణామాల గురించి విలేకరు ల ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. వార్తా పత్రికల్లో ఊహీజనిత కథనాలు ప్రచురిస్తారని ప్రేమ్‌జీ అన్నారు. ఎమిరె టిస్‌కు ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి చెైర్మన్‌ అవుతారని మీరే పత్రికల వారు వార్తలు ప్రచురించారు. ఈ విషయాలన్నీ మీ రు అక్కడ పనిచేసే మాజీ ఉద్యోగులు... ప్రస్తుతం పనిచేసే ఉ ద్యోగలు నుంచి సమాచారం సేకరించి వార్తలు ప్రచురిస్తారు. అంత టెన్షన్‌ ఎందుకయ్యా....ఏప్రిల్‌ 30 వరకు ఆగండి.

ఆ సస్పెన్స్‌ కాస్తా పోతుందని కదా అన్ని ప్రేమ్‌జీ అన్నారు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి ఈ ఏడాది ఆగస్టులో చెైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన వారసుడి ఎంపిక ఏప్రిల్‌ 30వ తేదీన జరుగుతుంది.దేశంలోని అతి పెద్ద ఐటి కంపెనీలు ఇన్ఫోసిస్‌, విప్రోలు. రెండు కంపెనీ ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉన్నాయి. ఈ రెండు కంపెనీల అందరూ ఒకదానితో మరోటిని పోల్చి చూసుకుంటారు. దేశంలో ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉంది మాత్రం టీసీఎస్‌, రెండవ స్థానం ఇన్ఫోసిస్‌, మూడవ స్థానం విప్రో... ఇన్ఫోసిస్‌ నాస్‌డాక్‌లో లిస్ట్‌ అవుతుండగా... విప్రో మాత్రం న్యూయార్కు స్టాక్‌ఎక్సే్ఛంజీలో లిస్టవుతుంది.

English summary
Wipro on Wednesday announced that it had posted consolidated revenues of Rs.31,099 crore, an increase of 15 per cent over the previous year. The company posted a net profit of Rs.5,298 crore, an increase of 15 per cent over the previous year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X