ల్యాప్‌టాప్ వాడుతున్నారా, ఐతే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా వాడటం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుంది. కళ్లు మంట, దురదగా ఉండటం, కళ్ల లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. మానిటర్‌ను తీక్షణంగా ఊసేవారిలో కనురెప్పలు వాల్చే సంఖ్య తగ్గిపోతుంది. దీంతో కళ్లుపొడిబారిపోతాయి. ఫలితంగా కంటి జబ్బులు వస్తాయి. తెరకు లైటింగ్‌ను సరిగా సెట్ చేసుకోకపోవడం ఒక కారణం. సీవిఎస్‌ను నియంత్రించడానికి 20-20- 20 సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిముషాలకు, 20 సెకన్ల విరామాన్ని తీసుకుని, 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువ్ఞ వైపుకు దృష్టిని మళ్లించాలి. విరామ సమయంలో ఎక్కువసార్లు కనురెప్పల్ని ఆర్పాలి. అయినప్పటికీ కళ్లు పొడిగా ఉంటే డాక్టరు సలహాతో డ్రాప్స్‌ను తీసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌తెర పెద్దగానూ, ప్రకాశవం తంగా ఉండేలా చూసుకోవాలి. కంటి చూపుకి తెర ఎప్పుడూ 90 డిగ్రీల కోణంలో ఉండాలి.
మనం ఆఫీసుల్లో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లపై పనిచేసేటప్పుడు మన చుట్టూ కంప్యూటర్లు ఉంటాయి. ఇలా కంప్యూటర్లన్నీ దగ్గర, దగ్గరగా ఉండటం వల్ల వీటిలోని విద్యుదయస్కాంత శక్తి మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ల్యాప్‌టాప్, కంప్యూటర్లకు టైప్ చేసే మన చేతులు 70 సెంటీమీటర్లు దూరంలో ఉండేలా చూసు కోవాలి. ఇలా చేసినప్పుడు మానిటర్‌పై టెక్ట్స్ చిన్నగా కనిపిస్తే సైజు పెంచుకోవడం మంచిది.చుట్టూ ఉండే మానిటర్లను నాలుగు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. దీంతో విద్యుదయస్కాంత శక్తి తగ్గుతుంది.కడుపుతో ఉన్నవారు కంప్యూటర్లను వాడకపోవడమే మంచిది. అలాగే ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని వాడటం శ్రేయస్కరం కాదు.
కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి నడుంనొప్పి, వెన్ను నొప్పి రావడం చాలా సహజం. ల్యాప్‌టాప్‌తో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల ఇలా వస్తుది. సాధారణంగా పీసీని వాడేట ప్పుడు వెన్నెముక, మెడను నిటారుగా ఉంచి పనిచేస్తాం. అదే ల్యాప్‌టాప్‌ను వాడేటప్పుడు మెడను కొద్దిగా కిందకి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి పనిచేసినా కూడా కూర్చునే కుర్చీని మన ఎత్తుకు తగినదాన్ని ఎంచుకుని చేసుకోవాలి. లేకపోతే మెడ నొప్పి, స్పాండిలైట్‌ను భరించాల్సిందే. ప్రత్యేకంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన స్టాండ్‌ల ద్వారా కానీ, టేబుల్స్ ద్వారా కానీ కంటిచూపునకు సమాంతరంగా తెరను అమర్చుకోవాలి.
దీంతో మెడను వాల్చాల్సిన అవసరం రాదు. నిర్ణీత సమయాల్లో అంటే ప్రతి అరగంటకోసారి ఐదు నిముషాలు రెస్ట్ తీసుకోవాలి. ఒక్కోసారి మెడనొప్పి వ్యాయామం కూడా తప్పనిసరి. అయితే ఈ వ్యాయామాన్ని ఫిజియోథెరపీ డాక్టరు సలహాతో చేస్తే మంచిది. ల్యాప్‌టాప్‌ను మోసేటప్పుడు తప్పనిసరిగా బండిపైనో, పక్కనో పెట్టుకుని ప్రయా ణించాలి తప్పితే భుజానికి తగిలించుకోకూడదు. భుజానికి తగిలించుకోవడం వల్ల భుజం నొప్పి వస్తుంది. ఒకవేళ భుజానికి తగిలించుకోవలసివస్తే ఒకవైపు కాకుండా రెండువైపులకు కలిపి (పిల్లల పుస్తకాల బ్యాగులా) తగిలించుకోవడం మంచిది.
రిపిటిటివ్ స్ట్రెస్ ఇంజురీ అనేది మణికట్టుకు వచ్చే వ్యాధి. ల్యాప్‌టాప్ కీబోర్డ్‌పై చేతుల్ని సరైన పద్ధతిలో పెట్టకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మణికట్టు, వేళ్లలో నొప్పి వస్తూ ఏదైనా వస్తువ్ఞను కూడా పట్టుకోలేనంత స్థాయికి చేరుతుంది. ల్యాప్‌టాప్ కీబోర్డ్‌కు సరైన స్థితిలో చేతుల్ని ఉంచాలి. వేళ్లను మోచేతికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మణికట్టును పక్కకు తిప్పి టైప్ చేయడం సురక్షితం కాదు.












Click it and Unblock the Notifications