వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ మృతితో వారు పాక్‌లోనే ఉన్నారని తేలింది: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లోనే హతం కావడంతో భారత్ వాదనలకు బలం చేకూరింది. లాడెన్ మృతిని బట్టి ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్‌లోనే ఉన్నారని రుజువైందని భారత హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. వివిధ ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ రక్షణ కేంద్రంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ముంబై దాడుల సూత్రధారులు, నియంత్రణదారులు, దాడులు చేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నట్లు స్పష్టమవుతోందని ఆయన సోమవారం ఓ ప్రకటనలో అన్నారు.

లాడెన్ పాకిస్తాన్‌లోని మారుమూల ప్రాంతంలో హతమయ్యాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముంబై దాడులతో సంబంధం ఉన్న వారి పేర్లను, వారి గొంతుల నమూనాలను తాము పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేసామని, వారందరినీ తమకు పాకిస్తాన్ అప్పగించాలని ఆయన అన్నారు.

English summary
India on Monday said the killing of global terrorist Osama bin Laden was a matter of grave concern as it proved that terrorists belonging to different groups find sanctuary in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X