హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదీ విషయం: నాదెండ్లకు వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సోమవారం తమకు ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ పంపించిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. రాయలసీమకు చెందిన ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాదులో నాదెండ్లను కలిసి వివరణ ఇచ్చుకున్నారు. తాము ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. కాగా వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా వివరణ ఇచ్చింది. అయితే ఆమె స్వయంగా రాకుండా తన వ్యక్తిగత కార్యదర్శిచే సమాధానాన్ని పంపించింది.

కొండా సురేఖ పంపిన సమాధానంలో మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారం ఉపసభాపతికి లేదని చెప్పారు. అధికారం లేకున్నప్పటికీ తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేవలం స్పీకరు కార్యాలయానికి ఉన్న అధికారాల గురించే రాజ్యాంగం పదోషెడ్యూలు చెప్పిందని, తనకు లేని అధికారాలు ఉపయోగించి నాదెండ్ల నోటీసులు జారీ చేశారని చెప్పారు.

కాగా స్పీకరును కలిసి వచ్చిన అనంతరం ఆదినారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని పడగొడతానని చేసిన జగన్ సవాల్‌కు చిరంజీవి స్పందన ఓ స్పందనే కాదన్నారు. స్పీకరుకు వివరణ ఇవ్వడానికి తమకు మంగళవారం వరకు అవకాశముందని చెప్పారు. అప్పటి వరకు పూర్తి వివరణ ఇస్తామని చెప్పారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp MLAs Adinarayana Reddy, Srikanth Reddy and Konda Surekha replied to Speaker notices. Konda Surekha sent her reply with her PA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X