హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనార్టీల కోసం వైయస్ జగన్ అర్రులు: అందుకే అక్బర్ పరామర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప జిల్లాలో దాదాపు 25 శాతం వరకు ఉన్న ముస్లిం మైనార్టీల కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్రులు చాచుతున్నారు. అందుకోసం అవసరమైన ఏ దారినీ ఆయన వదిలేందుకు ఇష్ట పడటం లేనట్లుగా ఉంది. శనివారం అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలియగానే ఆయన ఆదివారం నాటి తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. వెంటనే హుటాహుటిన హైదరాబాద్ వచ్చి కేర్ వెళ్లి అక్బరుద్దీన్ అన్న అసదుద్దీన్‌ను పరామర్శించారు. అక్బర్ ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. అయితే ఉప ఎన్నికలలో కడప జిల్లాలో ఉన్న ముస్లిం మైనార్టీలను ఆకట్టుకోవడానికే జగన్ హుటాహుటినా హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు కర్ణాటకకు చెందిన బిజెపి మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో సత్సంబంధాలు బహిర్గతం అయినప్పటికీ ఓట్లు ఎక్కడ పోతాయో అన్న భయంతో బిజెపితో సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. పుట్టపర్తిలో సత్యసాయిబాబా మృతి చెందినప్పుడు చూడటానికి రాని జగన్ కేవలం మైనార్టీల కోసమే ఇప్పుడు వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో మంచి పట్టు ఉన్న ఎంఐఎంను ఇప్పటి నుండే మచ్చిక చేసుకుందామనే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కడపలో మైనార్టీ ఓట్లను ఆకర్షించడంతో పాటు ముందు ముందు వారితో సత్సంబంధాలు కొనసాగించే ఉద్దేశ్యంలో భాగంగా కూడా జగన్ హైదరాబాద్ వచ్చి స్వయంగా కలిసినట్లుగా తెలుస్తోంది.

ఇక చంద్రబాబునాయుడు ఫోన్లో అసదుద్దీన్‌ను పరామర్శించారు. అక్బర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అక్బర్‌పై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షం అయిన ఎంబిటి నేత కాబట్టి చంద్రబాబు పరామర్శతో ఆగిపోయారు. ఇక కాంగ్రెసు పార్టీ కూడా కేర్‌ హాస్పిటల్‌కు క్యూ కట్టింది. మొత్తానికి కడప ఉప ఎన్నికలలో మైనార్టీలకు అన్ని పార్టీలో దాసోహం అంటున్నాయి.

English summary
All party leaders were trying to attract Muslim minorities for win in Kadapa bypoll. Ex MP YS Jaganmohan Reddy postponed his campaign for see Akbaruddin. TDP president Chandrababu was phoned to MP Akaduddin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X