అవినీతి వైయస్ జగన్‌ను, అసమర్థ కాంగ్రెసును ఓడించండి: చంద్రబాబు

మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దాడిని ఆయన ఖండించారు. రాష్ట్రంలో వరుసగా హత్యలు జరుగుతున్నాయని, వీటిని చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య నుంచి వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పట్టుకోలేకపోయారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో ఖజానా ఖాళీ అయిందని, తాము ముఠా సంస్కృతికి వ్యతిరేకమని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలను ఆదుకున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications