మూడు డిమాండ్లు అంగీకరించిన ప్రభుత్వం: జుడా - ప్రభుత్వ చర్చలు సఫలం

జుడాలు ప్రభుత్వం ముందుంచిన మూడు డిమాండ్లకు అంగీకరించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్ జిల్లాలోని ఆసుపత్రుల ముందు ఎస్పీఎఫ్ భద్రతా దళాలను నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నీలోఫర్ ఆసుపత్రిలో మంగళవారం నుండే భద్రతా దళాలను నియమించనున్నారు. ఆ ప్రధాన డిమాండుతో పాటు ఆసుపత్రిలో భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం, వైద్య సేవల అధ్యయనానికి మరో కమిటీని ఏర్పాటు చేయడం వంటి మరో రెండు డిమాండ్లకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ అధికారి పివి రమేష్ కూడా జుడా డిమాండ్లకు అంగీకరించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications