జగన్‌కు 2లక్షల మెజార్టీ వస్తే నా ఆస్తులు రాసిస్తా: వీరశివారెడ్డి సవాల్

YS Jagan
కడప: పులివెందుల, కడప ఉప ఎన్నికలలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తుందని అందరూ అంచనా వేస్తున్న సమయంలో కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివారెడ్డి జగన్ వర్గానికి సరికొత్త సవాల్ విసిరారు. వైయస్ జగన్‌కు కడప బరిలో రెండు లక్షల మెజార్టీ వస్తే తాను తన ఆస్తులు అన్నింటినీ జగన్‌కు రాసిస్తానని, జగన్ కూడా తనకు రెండు లక్షల మెజార్టీ రాకుంటే ఆయన ఆస్తులు నాకు రాసిస్తారా అని సవాల్ విసిరారు. జగన్‌కు అంత మెజార్టీ వచ్చే అవకాశమే లేదని అన్నారు.

జిల్లా ఎస్పీ జగన్ తొత్తుగా వ్యవహరించాడని వీరశివారెడ్డి ఆరోపించారు. నన్ను హౌస్ అరెస్టు చేసి ఎస్పీ రౌడీలను ప్రోత్సహించారని అన్నారు. జిల్లా ఎస్పీ ఖచ్చితంగా జగన్‌తో మ్యాచ్ ఫిక్స్ అయ్యారని అన్నారు. ఎస్పీ వైఖరిపై ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఎస్పీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+