టిడిపిలో నాగం ప్రకంపనలు: పరోక్ష హెచ్చరికలపై తర్జన భర్జన

ఇలా బాహాటంగా బహిరంగ సభలో నాగం టిడిపిని పరోక్షంగా టార్గెట్ చేయడం టిడిపి అధినేతతో పాటూ తమ్ముళ్లకు మింగుడు పటడం లేదు. పార్టీలోనే ఉంటూ ఇరకాటానికి గురి చేస్తున్న నాగంపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే నాగంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ వ్యతిరేక ముద్ర పడుతుందన్న భావనతో ఊరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీలోనే ఉంటూ నాగంకు చెక్ చెప్పేందుకు అవసరమైన చర్యలు తీసుకునే ఉద్దేశ్యంలో భాగంగా మంగళవారం బాబు తెలంగాణ ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు.
నాగం వ్యవహార శైలిపై, బహిరంగ సభలో ఆయన టిడిపిని టార్గెట్ చేసి మాట్లాడిన తీరుపై క్షుణ్ణంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. నాగంకు చెక్ చెప్పడానికి ఏం చేయాలా అని వారు తీవ్రంగా చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు నాగం సభకు టిడిపి క్రమశిక్షణా సంఘం చైర్మన్ విజయరామారావు వెళ్లడం కూడా టిడిపి నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. నాగం సభకు ఆరుగురు శాసనసభ్యులు హాజరయ్యారు. పార్టీలో ఉంటూనే పార్టీపై తిరుగు బాటు చేస్తున్న నాగంకు ఎలాగైనా చెక్ చెప్పాలని చంద్రబాబు కూడా తీవ్రంగా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కన్వీనర్ లేకుండా తెలంగాణ సమన్వయ కమిటీ వేసే ఆలోచనలో ఉన్ట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications