వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు 50 మంది మోస్ట్ వాంటెడ్ జాబితాను సమర్పించిన ఇండియా

By Pratap
|
Google Oneindia TeluguNews

Terrorists
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిన నేపథ్యంలో తమ దేశంలో నేరాలకు పాల్పడి పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నవారి విషయంలో భారత్ పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. పాకిస్తాన్‌కు భారతదేశం 50 మందితో కూడిన మోస్ట్ వాంటెడ్ జాబితాను అందజేసింది. ఈ జాబితాలో ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారులైన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సాయిద్, ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ కూడా ఉన్నారు.

జాబితాలో హఫీజ్ పేరు మొదటి స్థానంలో ఉండగా, దావూద్ పేరు ఎనిమిదో స్థానంలో ఉంది. 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కూడా ఉన్నాడు. ఈ జాబితా ఇలా ఉంది.

హఫీజ్ మొహ్మద్ సయీద్, సజ్జాద్ మజీద్, సయ్యద్ హసీం అబ్దుర్ రెహ్మాన్ పాషా, మేజర్ ఇక్బాల్, ఇల్యాస్ కాశ్మీరీ, రషీద్ అబ్దుల్లా, మేజర్ సమీర్ అలీ, దావూద్ ఇబ్రహీం, మెమెన్ ఇబ్రహీం, చోటా షకీల్, మెమెన్ అబ్దుల్ రజాక్, అనీస్ ఇబ్రహీం, అన్వర్ అహ్మద్ హజీ జమాల్, మొహ్మద్ దోశా, జావేద్ చిక్నా, సలీం అబ్దుల్ ఘాజీ, రియాజ్ ఖత్రీ, మునాఫ్ హలారీ, మొహ్మద్ సలీం ముజాహిద్, ఖాన్ బషీర్ అహ్మద్, యాకూబ్ యేదా ఖాన్, మొహ్మద్ మెమెన్, ఇర్ఫాన్ ఛౌగులే, ఫిరోజ్ రషీద్ ఖాన్, అలీ మూసా, సాగారి అలీ షేక్, అఫ్తాబ్ బక్తి, మౌలానా మొహ్మద్ మసూద్ అజర్, సలావుద్దీన్, ఆజం చీమా, సయ్యద్ జబియుద్దీన్ జాబి, ఇబ్రాహిం అథర్, ఆజర్ యూసుఫ్, జహుర్ ఇబ్రహీం మిస్త్రీ, అక్తర్ సయ్యద్, మొహ్మద్ షకీర్, రవూఫ్ అబ్దుల్, అమానుల్లా ఖాన్, సుఫియన్ ముఫ్తీ, నాచన్ అక్మల్, పఠాన్ యాకూబ్ ఖాన్, సిఎఎం బషీర్, లఖ్బీర్ సింగ్ రోడ్, పరంజిత్ సింగ్ పమ్మా, రంజిత్ సింగ్, వాధవా సింగ్, అబు హంజా, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అమీర్ రజా ఖాన్.

English summary
Turning more heat on Pakistan, India on Wednesday released a list of 50 "most wanted fugitives", including underworld don Dawood Ibrahim, 26/11 mastermind and LeT founder Hafiz Saeed and dreaded terrorist Zaki ur Rehman Lakhvi, hiding in that country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X